- వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయరాదని వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును కొనసాగించడానికి మాత్రం అనుమతించింది. అంతేగాక, లగచర్ల ఘటనపై ఈ నెల 25న బీఆర్ఎస్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి శంకర్‌నాయక్‌కు పర్మిషన్ ఇచ్చింది.
ఒక సివిల్ వివాదంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ శంకర్‌నాయక్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత కేసు నమోదైందని, మొదట దాఖలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నిందితుడిగానూ పేర్కొనలేదని, అందువల్ల ఆయనను అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.